ఇరాన్‌ - యూఎస్‌ రగడ: రాజకీయ జోక్యానికి యూఏఈ పిలుపు

- January 08, 2020 , by Maagulf
ఇరాన్‌ - యూఎస్‌ రగడ: రాజకీయ జోక్యానికి యూఏఈ పిలుపు

యూ.ఏ.ఈ:మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ మరియు ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌ డాక్టర్‌ అన్వర్‌ గర్గాష్‌, అమెరికా దళాలు వినియోగిస్తున్న ఇరాక్‌ ఎయిర్‌ బేస్‌లపై ఇరాన్‌ దాడులపై స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. పరిస్థితులు సద్దుమణిగేందుకు రాజకీయ జోక్యం అవసరమనీ, ఇరు పక్షాలూ ఈ విషయంలో ఆచి తూచి వ్యవహరించాలని మినిస్టర్‌ పేర్కొన్నారు. కాగా, టెహ్రాన్‌ నుంచి డజనుకు పైగా బాలిస్టిక్‌ మిస్సైల్స్‌ ఇరాకీ మిలిటరీ బేస్‌లపైకి దూసుకెళ్ళాయి. ఈ విషయాన్ని అమెరికా మిలిటరీ కూడా ధృవీకరించింది. ఇరాక్‌ మిలటరీ వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 22 మిస్సైల్స్‌, ఇరాన్‌ నుంచి సంధించబడ్డాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com