మస్కట్:ఇల్లీగల్ ఫర్నిచర్ వర్క్స్ నిర్వహిస్తున్న ఫామ్ ఫై రైడ్
- January 10, 2020
మస్కట్:మున్సిపల్ రెగ్యూలేషన్ & లాస్ కి విరుద్ధంగా ఫర్నిచర్ వర్క్ చేస్తున్న ప్రవాస కార్మికుల ఫామ్ పై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆఫీసర్స్ రైడ్ లో ఫామ్ లో చట్టవిరుద్ధంగా ఫర్నిచర్ వర్క్స్ జరుగుతున్నాయని నిర్ధారణ కావటంతో ఫామ్ ను మూసివేశారు. ఉత్తర అల్ బటినాలోని సోహార్ ఈ ఘటన చోటు చేసుకుంది. దేశంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా తమ అధికారులు కన్నేసి ఉంచుతారని కన్స్యూమర్ ప్రొటెక్షన్ జనరల్ డైరెక్టర్ అబ్దుల్ రెహ్మాన్ అల్ ఖస్మి వార్నింగ్ ఇచ్చారు. కమర్షిల్ ఫ్రాడ్ కు పాల్పడే వారు ఎంతటి దారుణాలకైనా తెగిస్తారని, చివరికి ప్రజల ఆరోగ్యాలను కూడా ఫణంగా పెట్టి తమ ఇల్లీగల్ యాక్టివిటీస్ కొనసాగిస్తారని ఆయన అన్నారు. వాళ్లకు నైతిక విలువలు ఉండవన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న అబ్దుల్ రెహ్మాన్...ఎక్కడైనా ఇల్లీగల్ వ్యవహారాలకు పాల్పడినట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని సిటిజన్స్ ను కోరారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!