బీజేపీ సీనియర్ నేత రామారావు మృతి ..

- January 17, 2016 , by Maagulf
బీజేపీ సీనియర్ నేత రామారావు మృతి ..

సిక్కిం మాజీ గవర్నర్,బీజేపీ సీనియర్ నేత రామారావు ఇవాళ హైదరాబాద్‌లో కన్నుమూశారు. 81 ఏళ్ల రామారావు అనారోగ్యంతో జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రామారావు 1935 డిసెంబర్ 12న కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు. 1956లో జన్‌సంఘ్‌లో చేరి రాజకీయ జీవితం ప్రారంభించి 2002 నుంచి 2005వరకు సిక్కిం రాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. ఆయన 4సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com