'కతర్ తెలంగాణా గల్ఫ్ సమితి' ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

- January 17, 2016 , by Maagulf

 


గత శుక్రవారం దోహా కతర్ తెలంగాణా గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో AlAli కంపెనీలో సంక్రాంతి సంబరాలలో వివిధ కంపెనీల నుండి చాలామంది కార్మికులు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. మన తెలంగాణ వివిద రకాల వంటలు రుచిచూపించారు. 
జానపద కళాకారులు ధర్మరాజు యాదవ్ దూలురు, గర్జన శేఖర్, చింతకుంట మహేందర్, శ్యాం, వినోద్ లు మన సాంస్కృతిక జానపద పాటలతో అలరించగా గంగిరెద్దుల వేషధారణ, ఆటలు ఆడిపించారు. పల్లెటూరు వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి తెలంగాణ గల్ఫ్ సమితి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు.

మాగల్ఫ్.కామ్ టీం తరపున 'కతర్ తెలంగాణా గల్ఫ్ సమితి టీం' కు అభినందనలు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com