వరుస సినిమాలతో హీరోయిన్ రాశి సింగ్ బిజీ బిజీ

- January 11, 2020 , by Maagulf
వరుస సినిమాలతో హీరోయిన్ రాశి సింగ్ బిజీ బిజీ

పోస్టర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయిన భామ రాశి సింగ్. తన తొలి సినిమాతోనే తెలుగు మాట్లాడటం నేర్చుకొని వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆది సాయి కుమార్ తో ఒక సినిమా, దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు  సాయిరామ్ శంకర్ మరియు అరవింద్ కృష్ణ లు హీరోలుగా ఒక సినిమా, శివాజీ రాజా కొడుకు విజయ్ హీరోగా జెమ్ అనే సినిమాలో నటిస్తూ మరికొన్ని సినిమాలకు కథలు వింటున్నా అని చెప్పుకొచ్చింది ఈ ఛతీస్ ఘడ్ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడు తెలుగు మాట్లాడుతుండటం తో పాటు నటనలో కూడా మంచి ప్రతిభ కలిగి ఉండటం వలన ఈ అమ్మడిని హీరోయిన్ గా తీసుకునేందుకు దర్శక నిర్మాతలు కూడా ఒకే అంటున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఏది ఏమైనా హీరోయిన్స్ కి తెలుగు మాట్లాడటం వస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు పుష్కలంగా వస్తాయని హీరోయిన్ రాశి సింగ్ మరోసారి నిరూపించింది.ఈ అమ్మడు నటించిన సినిమా పోస్టర్ అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com