దుబాయ్‌:ఇండియన్‌ కమ్యూనిటీ చొరవతో భారతీయ కార్పెంటర్‌కి విముక్తి

- January 15, 2020 , by Maagulf
దుబాయ్‌:ఇండియన్‌ కమ్యూనిటీ చొరవతో భారతీయ కార్పెంటర్‌కి విముక్తి

దుబాయ్‌:ఎన్నో ఆశలతో గల్ఫ్‌ దేశాల బాట పట్టాడు. చక్కని భవిష్యత్తు ఉంటుందని ఆశపడ్డాడు. కానీ, అతని కల చెదిరిపోయింది. సంపాదించిన డబ్బు పోయింది. వీసా, పాస్‌ పోర్టు తీసుకున్నారు. ఇవన్ని చాలనట్టు అతనిపై కేసు కూడా నమోదైంది. దీంతో చివరికి తినేందుకు తిండి కూడా లేకుండా పోయింది. ఇండియా నుంచి దుబాయ్‌కి వలస వెళ్లిన కార్పెంటర్‌ కుమార్‌ దీనస్థితి ఇది. ఇంటికి రాలేక..దుబాయ్‌లో ఉండలేక ప్రత్యక్ష నరకం అనుభవించాడతను. నిస్సాయుడిగా మారి భవిష్యత్తు మీద నమ్మకం పోగట్టుకున్న కుమార్‌ ను ఇండియన్‌ కమ్యూనిటీ సభ్యులు ఆదుకున్నారు. దుబాయ్‌ లో చిక్కుకుపోయిన అతన్ని మళ్లీ ఇండియాకు పంపించి సాటి ఇండియన్‌కు విముక్తి కల్పించారు.

కుమార్‌ యూఏఈలో కార్పెంటర్‌ జాబ్‌ కోసం వచ్చాడు. 700 దిర్హామ్‌ల జీతంతో 2016లో జాబ్ లో చేరాడు. రెండేళ్ల పాటు అంతా సవ్యంగానే జరిగింది. ఇంటికి బాగానే డబ్బు పంపించాడు. రెండేళ్ల తర్వాత కుమార్‌కు కష్టాలు మొదలయ్యాయి. జాబ్ పోయింది. అతనికి ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి పాస్‌ పోర్ట్ తీసుకున్నాడు. వీసా 2018లోనే ఎక్స్‌పైర్‌ అయిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఎవరో దయతలిచి మెతుకు వేస్తే పూట గడుపుకోవాల్సిన పరిస్థితి. దీనికితోడు అతని ఎంప్లాయర్‌ కుమార్‌ పై కేసు కూడా పెట్టాడు.

ఒక రోజు రెష్మా అనే ఇండియన్‌ తనను చూసిందని కుమార్‌ చెప్పాడు. ఆమె అతని వివరాలు అన్ని తీసుకుంది. మరుసటి రోజు ఇండియన్‌ కమ్యూనిటీ మెంబర్స్‌తో వచ్చిన రెష్మా పూర్తి వివరాలు తీసుకొని ఇండియన్‌ ఎంబసీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇండియన్‌ ఎంబసీలోని కాన్సుల్ జనరల్‌ విపుల్‌ అతన్ని స్వదేశానికి పంపించేందుకు అవసరమైన సాయం చేశారు. లోకల్‌ అన్ని అడ్డంకులు క్లియర్‌ చేసి టికెట్ ఇప్పించి స్వదేశానికి పంపించారు. ఇండియన్‌ కమ్యూనిటీ మెంబర్స్‌ గుండల్లి నర్సింహులు (సోషల్ వర్కర్)మరియు ఇండియన్ అసోసియేషన్-షార్జా , కాన్సుల్‌ జనరల్ ఆఫ్‌ ఇండియా సహకారంతో కుమార్‌కు విముక్తి లభించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com