జనవరి 19న వైజాగ్ లో 'అల... వైకుంఠపురంలో' వైభవంగా విజయోత్సవ వేడుకలు !!!
- January 17, 2020
'అల... వైకుంఠపురంలో' చిత్రానికి ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ అత్యద్భుతంగా ఉంది. విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ గా నమోదు చేసుకుంది.. గతానికి భిన్నంగా ఓవర్ సీస్ లో కూడా ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ దక్కించుకోవడం గమనార్హం. సినిమా ఇంతటి ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ అభిమానుల సమక్షంలో బహిరంగంగా ఈ చిత్ర విజయోత్సవ సభ నిర్వహించబోతున్నారు.
జనవరి 19న వైజాగ్ లో అల వైకుంఠపురంలో సక్సెస్ సెల్రబ్రేషన్ గ్రాండ్ గా చేయబోతున్నారు చిత్ర యూనిట్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి అల వైకుంఠపురంలో చిత్రాన్ని నిర్మించగా, త్రివిక్రమ్ తెరకెక్కించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం ఈ ఇయర్ బిగినింగ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ఈ ‘అల వైకుంఠపురంలో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్స్‌పై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు ఈ చిత్రాన్ని.. సంక్రాంతి సందర్భంగా 2020, జనవరి 12న విడుదల అయిన ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డుగా నమోదు వైపు దూసుకు వెళుతోంది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!