బలపడ్తున్న రియాల్
- January 18, 2016
అంతర్జాతీయ మార్కెట్లో రియాల్ బలపడ్తుండడం దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే కాకుండా, దేశంలో పెరుగుతున్న ధరలకు అడ్డుకట్ట వేస్తుందని ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ (ఓసిసిఐ) వర్గాలు వెల్లడించాయి. డీజిల్ ధరల పెరుగుదల కూడా కాంపన్సేట్ చేయడానికి వీలవుతుందని ఓసిసిఐ మెంబర్ అహ్మద్ అల్ హూటి చెప్పారు. రియాల్ బలోపేతమవడంతో దిగుమతులు, ఎగుమతుల ద్వారా దేశ ఆర్థిక రంగానికి మేలు కలుగుతుందని, ఉత్పత్తుల దిగుమతి చవక అవుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం కూడా ధరల పెరుగుదల విషయంలో వెనక్కి తగ్గడంతో ఇతర రంగాలూ ప్రజలపై భారం మోపకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఓసిసిఐ అభిప్రాయపడింది. అయితే అన్ని కోణాల్లోనూ ఆలోచించాకే ధరల పెరుగుదలపై నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతూనే పెంపు చాలా స్వల్పమేనని వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







