బలపడ్తున్న రియాల్

- January 18, 2016 , by Maagulf
బలపడ్తున్న రియాల్

అంతర్జాతీయ మార్కెట్‌లో రియాల్‌ బలపడ్తుండడం దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే కాకుండా, దేశంలో పెరుగుతున్న ధరలకు అడ్డుకట్ట వేస్తుందని ఒమన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మరియు ఇండస్ట్రీ (ఓసిసిఐ) వర్గాలు వెల్లడించాయి. డీజిల్‌ ధరల పెరుగుదల కూడా కాంపన్సేట్‌ చేయడానికి వీలవుతుందని ఓసిసిఐ మెంబర్‌ అహ్మద్‌ అల్‌ హూటి చెప్పారు. రియాల్‌ బలోపేతమవడంతో దిగుమతులు, ఎగుమతుల ద్వారా దేశ ఆర్థిక రంగానికి మేలు కలుగుతుందని, ఉత్పత్తుల దిగుమతి చవక అవుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం కూడా ధరల పెరుగుదల విషయంలో వెనక్కి తగ్గడంతో ఇతర రంగాలూ ప్రజలపై భారం మోపకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఓసిసిఐ అభిప్రాయపడింది. అయితే అన్ని కోణాల్లోనూ ఆలోచించాకే ధరల పెరుగుదలపై నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతూనే పెంపు చాలా స్వల్పమేనని వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com