మొబైల్ రీచార్జ్ అడిగినందుకు భార్యను కొట్టి చంపిన భర్త
- January 22, 2020
అజ్మాన్: మొబైల్ రీచార్జ్ కార్డ్ అడిగిన భార్యను కొట్టి చంపాడో భర్త. ఇద్దరి మధ్యా మొబైల్ రీచార్జ్ విషయమై గొడవ జరగ్గా, సహనం కోల్పోయిన భర్త, తన చేతిలో వున్న కర్రతో భార్య తల మీద గట్టిగా కొట్టడంతో 49 ఏళ్ళ భార్య మృతి చెందింది. కాగా, 58 ఏళ్ళ వయసున్న భర్త, తాను ప్రార్థన చేస్తున్న సమయంలో తన భార్య తన మీద రీచార్జ్ విషయమై ఒత్తిడి తెచ్చిందనీ, దాంతో తాను ఆమెను కోపంతో కొట్టిన మాట వాస్తవమేగానీ, చంపాలనుకోలేదని విచారణలో చెప్పాడు. కర్రతో కొట్టిన తర్వాత ఆమె అక్కడే వుండిపోయిందనీ, తాను బయటకు వెళ్ళి రీచార్జ్ కార్డ్ తీసుకొచ్చి ఆమెకు ఇచ్చేందుకు ప్రయత్నించాననీ, అయితే ఆమె మళ్ళీ లేవలేదని చెప్పాడు నిందితుడు. తలలో అంతర్గతంగా రక్తస్రావం జరగడంతో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు మెడికల్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు