ఒమన్‌ నుంచి తప్పుకున్న రైడ్‌ హెయిలింగ్‌ యాప్‌ కరీమ్‌

- January 23, 2020 , by Maagulf
ఒమన్‌ నుంచి తప్పుకున్న రైడ్‌ హెయిలింగ్‌ యాప్‌ కరీమ్‌

మస్కట్‌: రైడ్‌ హెయిలింగ్‌ యాప్‌ కరీమ్‌, మిడిల్‌ ఈస్ట్‌ మరియు నార్త్‌ ఆఫ్రికాలో తన సేవల్ని కొనసాగిస్తున్న విషయం విదితమే. అయితే ఒమన్‌లో వచ్చే నెల నుంచి తన కార్యకలాపాల్ని ఉపసంహరించుకోనుంది కరీమ్‌. ఫిబ్రవరి 3 నుంచి కరీమ్‌ సర్వీసులు ఒమన్‌లో అందుబాటులో వుంవని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. కరీమ్‌, ఒమన్‌ మార్కెట్‌లోకి మర్హాబా ట్యాక్సీతో ఒప్పందం ద్వారా ప్రవేశించింది. మరోపక్క, మర్హాబా ట్యాక్సీ తన ఆపరేషన్స్‌ యధాతథంగా కొనసాగిస్తుందని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com