మస్కట్:2020 టూర్ ఆఫ్ ఒమన్ రద్దు

మస్కట్:2020 టూర్ ఆఫ్ ఒమన్ రద్దు

ఫిబ్రవరిలో జరగాల్సిన 2020 టూర్ ఆఫ్ ఒమన్ రేస్ రద్దు చేస్తున్నట్లు రేస్ నిర్వాహక సంస్థ అమౌరీ స్పోర్ట్ ఆర్గనైజేషన్-ASO ప్రకటించింది.  ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం టూర్ ఆఫ్ ఒమన్ 11వ ఎడిషన్ వచ్చే నెల 11 నుంచి 16 వరకు జరగాల్సి ఉంది. అయితే..ఫిబ్రవరి 21 వరకు ఒమన్ దివంగత సుల్తాన్ కబూస్ సంతాప దినాలు ఉండటంతో రేస్ రద్దు చేస్తున్నట్లు ASO తెలిపింది. 2010 నుంచి అమౌరీ స్పోర్ట్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తూ వస్తోంది. క్రిస్ ఫ్రూమ్, విన్సెంజో నిబాలితో లాంటి స్టార్ జీసీ రైడర్స్ పార్టిసిపేషన్ తో టూర్ ఆఫ్ ఒమన్ కు ఇటీవలి కాలంలో క్రేజ్ పెరిగిన విషయం తెలిసిందే. కజఖ్ అలెక్సీ లుట్సెంకో 9, 10వ ఎడిషన్ విజేతగా నిలిచారు.

Back to Top