షార్జా:ఫైర్ యాక్సిడెంట్ కు మెయిన్ రీజన్స్ రివీల్ చేసిన అధికారులు
- January 25, 2020
షార్జాలో జరుగుతున్న అగ్నిప్రమాదాలకు ప్రధాన కారణాలను అగ్నిమాపక శాఖ రివీల్ చేసింది. షార్ట్ సర్క్యూట్, సిగరేట్ పీకలు, రాన్డమ్ స్టోరేజ్, నాసిరకం ఎలక్ట్రికల్ కనెక్షన్ ల కారణంగానే ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నట్లు ప్రకటించింది. గత ఏడాదిలో జరిగిన ఓ అగ్నిప్రమాదానికి కూడా ఇదే తరహా కారణాలతో సంభవించిందని తెలిపింది. అప్పటి ప్రమాదంలో మహిళతో పాటు ఆమె కూతురు మరణించింది. షార్ట్ సర్క్యూట్ తో ఇళ్లలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకోకుండా క్వాలిటీ ఎలక్ట్రికల్ కనెక్షన్లను యూజ్ చేయాలని షార్జా పోలీస్ ఫోరెన్సిక్ లాబరేటరీకి చెందిన ఫైర్ ఎక్స్ పర్ట్ కల్నల్ అదెల్ అల్ మజ్మి సూచించారు. అలాగే రెసిడెన్షియల్ బిల్డింగ్స్, కంపెనీలు, ఫ్యాక్టరీస్ ప్రాంతాల్లో సిగరేట్ పీకలను పడేయొద్దని అధికారులు కోరారు. తాగి పడేసిన సిగరేట్ కారణంగా గతంలో జరిగిన ఓ అగ్నిప్రమాదాన్ని ఊదాహరణ చెప్పుకొచ్చారు. అల్ మజజ్ లోని 43 అంతస్తుల రెసిడెన్షియల్ బిల్డింగ్ లో ఓ వ్యక్తి సిగరేట్ తాగి పడేయటంతో కింద ఫ్లోర్ లోని బాల్కనిలో పడి బిల్డింగ్ లో ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి టెన్త్ ఫ్లోర్ వరకు మంటలు అంటుకున్నాయని గుర్తు చేశారు. అలాగే స్టోర్డ్ గూడ్స్ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఎయిర్ కండీషనర్స్ పై ఓవర్ లోడ్ పడటం కూడా ఒక్కోసారి అగ్నిప్రమాదాలకు దారితీయొచ్చని ఫైర్ సెఫ్టీ అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







