దుబాయ్ లో ఘనంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

- January 26, 2020 , by Maagulf
దుబాయ్ లో ఘనంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

దుబాయ్:దుబాయ్ లో వందలాది మంది భారతీయులు దుబాయ్‌లోని కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం వద్ద జరిగిన భారత 71 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకున్నారు. యూఏఈలో ఇండియన్ కాన్సల్ జనరల్ విపుల్‌, త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. భారతీయులంతా ఈ కార్యక్రమంలో దేశభక్తి గీతాల్ని ఆలపించారు. జాతీయ పతాకావిష్కరణ తర్వాత విపుల్‌, అక్కడికి చేరుకున్న భారతీయుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని చదివి వినిపించారు.దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను, వారి కుటుంబ సభ్యులను గుర్తుచేసుకున్నారు. పిల్లలు, పెద్దలు సంప్రదాయ వస్త్రధారణలో కనువిందు చేశారు. 

--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com