ప్రొడక్షన్ రంగంలో వర్ధమాన హీరో సాయిరాం
- January 19, 2016
వర్ధమాన హీరో, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ సంక్రాంతి పండుగను తన స్వగ్రామం బి.కె.పల్లిలో కుటుంబ సభ్యుల నడుమ ఆనందంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన స్థానిక విలేకరులతో సరదాగా ముచ్చటించారు... అవి ఆయన మాటల్లోనే...చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి... పండగకు ఇక్కడకు రాగానే నా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. చిన్ననాటి స్నేహితులతో భుజాలపై చేతులు వేసి తీర్థంలో తిరగాలని ఆశగా ఉంది.. పండుగను అమ్మతో పంచుకోవడం సంతోషాన్ని కలిగించింది. ఈ సంతోషంలో గణి(నర్సీపట్నం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర గణేష్) కూడా పాలు పంచుకున్నారు.సినిమాలతో బిజిబిజీ ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాను. ఈ రెండు సినిమాలు విశాఖ, అరకు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. 'వాడు నేను కాదు' సినిమా విశాఖలో 40 రోజుల పాటు షూటింగ్ జరుపుకొంది. ఇంకా ఈ నెలాఖరు వరకు జరుగుతుంది. ఈ సినిమా 4 భాషల్లో రూపొందుతోంది.అలాగే మరో సినిమా 'అరకురోడ్డులో' కూడా శరవేగంగా తయారవుతోంది. ఇంకా పేరుపెట్టని సినిమాలో శరత్‌కుమార్‌తో కలిసి నటిస్తున్నాను. వాడు నేను కాదులో లవ్, ఏక్షన్, మిస్టరీ మిళితమై ఉంటాయి. కాగా అరకు లోయలో సినిమా సస్పెన్స్ థ్రిల్లర్. ఈ రెండు సినిమాలు మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటాయి. మరో కొత్త సినిమా ఫిబ్రవరి 12న ప్రారంభం కానుంది. దీంతో చేతినిండా సినిమాలతో ఈ ఏడాదంతా బిజీగా ఉన్నాను.దర్శకత్వం చేయాలని.. నటుడిగా మంచి గుర్తింపు వచ్చాక దర్శకత్వం చేయాలని ఉంది. అన్నయ్య ఇచ్చిన 143తో లవర్‌బాయ్ ఇమేజ్ రాగా 'బంపర్ ఆఫర్' సినిమా మాస్ ఇమేజ్ను అందించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాలన్నిటిలో కూడా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే. అంతేకాదు ప్రొడక్షన్ రంగంలో కూడా నేనేంటో నిరూపించుకుంటా.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









