ఆర్నబ్ పై ఆగ్రహం...కమెడియన్ బ్యాన్

- January 29, 2020 , by Maagulf
ఆర్నబ్ పై ఆగ్రహం...కమెడియన్ బ్యాన్

జాతీయ ఛానల్ అయిన 'రిపబ్లిక్‌ టీవీ' ఎడిటర్, ప్రముఖ జర్నలిస్ట్‌ ఆర్నాబ్‌ గోస్వామిపై తమ విమానంలో అనుచితంగా ప్రవర్తించిన కారణంగా స్టాండ్‌ అప్‌ కమెడియన్‌ కునాల్‌ కామ్రా పై ఇండిగో విమానయాన సంస్థ నిషేధం విధించింది. 6 నెలల పాటు తమ విమానాల్లో ప్రయాణించేందుకు కామ్రాను అనుమతించబోమని ట్వీట్‌ చేసింది. ఇటీవల కునాల్ కామ్రా ముంబై నుంచి లక్నో వెళ్తున్నారు. అయితే అందులో రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి కూడా ఉన్నారు. అర్నాబ్‌తో కునాల్ కామ్రా అనుచితంగా ప్రవర్తించారు. అర్నాబ్ గోస్వామితో కునాల్ కామ్రా ఎగతాళిగా మాట్లాడాడు. అర్నాబ్ హెడ్‌ఫోన్స్ పెట్టుకున్నా సరే ఆయన ముందుకు వెళ్ళిన కామ్రా ఆర్నాబ్ లాగే మాట్లాడుతూ టీవీ డిస్కషన్‌ లో మాదిరిగా ప్రవర్తించాడు.

ఈ మేరకు ఓ వీడియో కూడా తీసి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై ఇండిగో సంస్థ స్పందించింది. ప్రయాణికుడితో అనుచితంగా ప్రవర్తించినందుకు కామ్రాపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొన్నది. కామ్రా చర్యలను పౌర విమానయాన శాఖా మంత్రి హర్దీప్‌సింగ్ పురి తప్పుపట్టారు. ఇది క్షమించరాని నేరమని, ఎయిర్ ఇండియాలో కూడా నిషేధిస్తామని స్పష్టంచేశారు. అయితే ప్రయాణ నిషేధంపై కునాల్ కామ్రా స్పందించారు. తనను ఆరు నెలల సస్పెన్షన్ వేసిన ఇండిగో యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఎయిర్ ఇండియాను ఎప్పటికీ నిషేధించబోతున్నారని కామ్రా ట్వీట్ చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com