ధ్యానం చేయడం వల్ల ఉపయోగం...

- January 31, 2020 , by Maagulf
ధ్యానం చేయడం వల్ల ఉపయోగం...

గల్ఫ్ దేశాల్లో ఎక్కువ శాతం కార్మికులు మానసిక కుంగుబాటుతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ మానసిక కుంగుబాటునే డిప్రెషన్ అంటారు. అంటే, డిప్రెషన్‌తో బాధపడేవారి శరీరంలోని జీవక్రియలన్నీ నిదానిస్తాయి. అంటే సాఫీగా సాగకుండా కుంటుపడతాయి. ఇవి చివరకు వృత్తిపరమైన నిర్లిప్తతకూ, అసమర్థతకూ దారితీస్తాయి.

ఇలాంటి సమస్యతో బాధపడేవారికి ఏకైక మందు ధ్యానం. మనోబలాన్ని అద్భుతంగా ఉత్తేజితం చేసే ధ్యానం వల్ల కానీ ఖర్చు లేకుండా డిప్రెషన్‌ నుంచి బయటపడేసి ఏకైక దివ్యౌషధం. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల పూర్తిగా మానసిక ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంది.

ముఖ్యంగా, ఈ ధ్యానానికి ప్రతికూల పరిస్థితులను సమూలంగా తొలగించే శక్తివుంది అందువల్ల క్రమం తప్పకుండా రోజూ ధ్యానం చేస్తే డిప్రెషన్‌తో పాటు... మనసు నిలకడా ఉండటమే కాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com