మార్చి 24 నుంచి 26 వరకు దుబాయ్‌లో సదస్సుకు హాజరవనున్నకేటీఆర్
- January 31, 2020
హైదరాబాద్:రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సుకు హాజరుకానున్నారు. వార్షిక పెట్టుబడిదారుల సమావేశంలో పాల్గొనాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థిక మంత్రిత్వశాఖ కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించింది. భవిష్యత్ కోసం పెట్టుబడులు-ప్రపంచ పెట్టుబడి వ్యూహాలు (ఇన్వెస్టింగ్ ఫర్ ఫ్యూచర్-షేపింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీస్) అనే థీమ్‌తో దుబాయ్ వేదికగా మార్చి 24వ తేదీ నుంచి 26 వరకు 10వ వార్షిక పెట్టుబడిదారుల సదస్సును నిర్వహించనున్నామని తెలిపింది. మూడు రోజుల జరిగే ఈ సదస్సులో భాగం గా ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ సదస్సు, సెక్టరైజ్డ్ రౌండ్‌టేబుల్, కంట్రీ ప్రెజెంటేషన్స్, వర్క్‌షాప్స్, ఎగ్జిబిషన్స్, ఇన్వెస్ట్‌మెంట్ అవార్డ్స్ లాంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ప్రతినిధుల అనుభవాలను తె లుసుకోవడం, చర్చించడమే ఈ సదస్సు లక్ష్యమని స్పష్టంచేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతమున్న ఆర్థి క పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), స్టార్టప్స్, ఫ్యూచర్ సిటీస్, ఎస్‌ఎంఎస్‌ఈ, ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ లాంటి అంశాలను వార్షి క పెట్టుబడిదారుల సదస్సు పరిగణనలోకి తీసుకోనున్నదని, వన్ రోడ్-వన్ బెల్ట్ అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపింది. ఈ సదస్సులో పెట్టుబడిదారులు, కేంద్రప్రతినిధులు తదితరులు ప్రభుత్వ రాయబారులతో సమావేశమై పెట్టుబడుల సహకారం, భాగస్వామ్యా ల ఏర్పాటుకు కృషిచేస్తారని, సుస్థిరమైన పె ట్టుబడుల కోసం కృషిచేసినవారికి సదస్సులో ఇన్వెస్ట్‌మెంట్, ఇన్వెస్టర్ అవార్డులను ప్రదా నం చేయనున్నామని వివరించింది. యూఏఈ ప్రభుత్వం నుంచి ఆహ్వానం రావడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. పలు అంతర్జాతీయ వేదికల నుంచి వస్తున్న ఆహ్వానాలు తెలంగాణ ప్రభుత్వ విధానాలకు దక్కుతున్న ప్రశంసలుగా కేటీఆర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు