కరోనా వైరస్‌తో స్కూళ్ళు మూతపడలేదు

- January 31, 2020 , by Maagulf
కరోనా వైరస్‌తో స్కూళ్ళు మూతపడలేదు

యూ.ఏ.ఈ:ఫిబ్రవరి 2 నుంచి కొన్ని స్కూళ్ళు కరోనా వైరస్‌ తీవ్రత కారణంగా మూతపడనున్నట్లు సర్క్యులేట్‌ అవుతున్న వార్తలో నిజం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలకు ఈ వైరస్‌ వ్యాప్తి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా అనేక పుకార్లు కూడా ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి. తాజాగా యూఏఈలోకి వైరస్‌ ప్రవేశించిందనీ, దాంతో స్కూళ్ళకు సెలవులు ప్రకటించారనీ ఓ ఫేక్‌ వార్త సోషల్‌ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. కాగా, వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జన్సీని ప్రకటించింది కరోనా వైరస్‌ తీవ్రత నేపథ్యంలో.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com