గల్ఫ్ ప్రవాసి అంతిమయాత్రలో వినూత్న ప్రదర్శన
- February 04, 2020
తెలంగాణ:విదేశాలలో అసువులుబాసిన ప్రవాసీ కార్మికుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల మృతధన సహాయం చెల్లించాలని కోరుతూ గ్రామ ప్రజలు, గల్ఫ్ ప్రవాసీలు ఒక గల్ఫ్ కార్మికుడి అంతిమయాత్రలో ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించిన సంఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పాయిపల్లి గ్రామంలో మంగళవారం (04.02.2020) జరిగింది.
తిప్పాయిపల్లికి చెందిన నరుకుల్ల శ్రీను గత నెల 4న ఖతార్ దేశంలో మృతి చెందగా, సరిగ్గా నెలరోజులకు శవపేటిక స్వగ్రామానికి చేరుకున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై విభాగం వారు హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి తిప్పాయిపల్లి వరకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు.
ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ నాయకులు స్వదేశ్ పరికిపండ్ల, గజ్జెల అశోక్ ల నాయకత్వంలో ప్రవాసీ అంతిమయాత్ర జరిగింది. గల్ఫ్ ప్రవాసీ కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ లో రూ. 500 కోట్లు కేటాయించాలని, రాష్ట్రం నుండి విదేశాలకు జరిగే వలసలపై ప్రభుత్వం సమగ్రమైన సర్వే నిర్వహించాలని వారు ఈ సందర్బంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..