ఉగ్రనిధుల కేసులో హఫీజ్ సయీద్‌కు ఐదేళ్లు జైలు
- February 12, 2020
ఇస్లామాబాద్: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసుల్లో కరడుకట్టిన ఉగ్రవాది, జమాత్- ఉద్-దవా (జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్‌ను పాక్ కోర్టు బుధవారంనాడు దోషిగా నిర్ధారిస్తూ తీర్పు చెప్పింది. ఐదేళ్లు జైలుశిక్ష విధించింది. 2008లో 166 మంది ప్రాణాలు కోల్పోయిన ముంబై ఉగ్రపేలుళ్ల కేసులో హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు.
పారిస్‌లో ఫైనాన్స్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఏఫ్) ప్లీనరీ జరుగబోతున్న తరుణంలో దీనికి రెండ్రోజుల ముందు పాక్ కోర్టు తాజా తీర్పు ఇచ్చింది. పారిస్ ప్లీనరీలో పాక్‌ను బ్లాక్‌లిస్టులో లేదా గ్రేలిస్ట్‌లో పెట్టే విషయంపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. సయీద్‌ను పాక్ కోర్టు రెండు కేసుల్లో దోషిగా నిర్ధారించడంతో పాటు ఒక్కో కేసుకు రూ.15,000 చొప్పున జరిమానా కూడా విధించింది. ఈ రెండు కేసుల్లోనూ ఐదేళ్ల జైలుశిక్ష ఏకకాలంలో అమలు అవుతుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..