దోహ: ఖతార్ కు తమిళనాడు నుంచి ఫస్ట్ డైరెక్ట్ ఫ్లైట్
- February 12, 2020
ఇండియన్ బడ్జెట్ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఖతార్ కు డైరెక్ట్ ఫ్లైట్ ఆపరేట్ చేయనుంది. మార్చి 31 నుంచి కొత్త సర్వీస్ ప్రారంభం కాబోతోంది. తమిళనాడులోని తిరుచిరపల్లి నుంచి దోహా మధ్య నడవనుంది. వారంలో మూడు రోజులు ఫ్లైట్ ఆపరేట్ చేస్తారు. మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో ఈ డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. దోహలోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి తెల్లవారుజామున 4.40(లోకల్ టైం) కి బయలుదేరి 11.45గంటలకు (ఇండియన్ లోకల్ టైం) తిరుచిరపల్లికి చేరుకుంటుంది. మళ్లీ అర్ధరాత్రి ఒకటిన్నరకు తిరుచిరపల్లిలో బయల్దేరి దోహాకు 3.40(దోహ లోకల్ టైం) గంటలకు చేరుకుంటుంది. తిరుచిరపల్లి-దోహా డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ కు ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







