ఫోన్ స్కామ్: 200,000 దిర్హామ్ లు రికవరీ చేసిన దుబాయ్ పోలీస్
- February 12, 2020
ఫోన్ స్కామ్ కారణంగా 200,000 దిర్హామ్ లు పోగొట్టుకున్న బాధితుడికి దుబాయ్ పోలీసులు న్యాయం చేశారు. కేసు వివరాల్లోకి వెళితే, బాధితుడొకరు తన భార్య ఫోన్‌కి ‘200,000 దిర్హామ్ ల బహుమతి వచ్చింది’ అనే ఆడియో మేజేస్ రావడంతో, ఆ ఆడియో మెసేజ్‌లో పేర్కొన్న విధంగా ఐడీ, ఏటీఎం కార్డ్ వివరాల్ని పంపించారు. అయితే, బహుమతి రాకపోగా, తన అకౌంట్లో నుంచి డబ్బులు పోగొట్టుకున్నట్లు బాధితుడు ఆ తర్వాత గుర్తించడం జరిగింది. వెంటనే పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, బాధితుడు పోగొట్టుకున్న డబ్బుని రికవర్ చేయగలిగారు. ఈ సందర్భంగా పోలీసులకు బాధిత వ్యక్తి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, 28 ఫ్రాడ్స్టర్స్, 13 ఇతర గ్యాంగ్‌లను ఈ తరహా ఫోన్ స్కావ్ులకు సంబంధించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..