కరోనా అలర్ట్: చైనీస్ కమర్షల్ సెంటర్స్ తో వైరస్ సోకే ప్రమాదం లేదు..MOH క్లారిటీ

- February 13, 2020 , by Maagulf
కరోనా అలర్ట్: చైనీస్ కమర్షల్ సెంటర్స్ తో వైరస్ సోకే ప్రమాదం లేదు..MOH క్లారిటీ

మస్కట్: కరోనా వైరస్ ప్రపంచ దేశాలు వణికించేస్తోంది. శరవేగంగా వ్యాప్తి చెందుతుండటంతో చైనా నుంచి వచ్చే ప్రయాణికులే కాదు..అక్కడి నుంచి దిగుమతి అయ్యే ప్రొడక్ట్స్ అంటే కూడా జనం హడలిపోతున్నారు. అయితే..కరోనా వైరస్ ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించేందుకు మినిస్ట్రి ఆఫ్ హెల్త్ ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా అవేర్ నెస్ ప్రొగ్రామ్స్ చేపట్టిన విషయం తెలిసిందే. దీనికితోడు వైరస్ ను ఎదుర్కునేందుకు ఆస్పత్రుల్లో ఐసోలేటెడ్ వార్డులు, ప్రత్యేక కిట్ లను కూడా సిద్ధం చేసుకుంది. అయితే..వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజల్లో మాత్రం భయం తొలగిపోవటం లేదు. చైనా నుంచి ఆన్ లైన్ ద్వారా దిగుమతి చేసుకునే వస్తువుల ద్వారా వైరస్ వ్యాపించొచ్చని మస్కట్ ప్రజలు భయపడుతున్నారు.

అయితే..ఇంపోర్టెడ్ వస్తువుల ద్వారా వైరస్ సోకే అవకాశాలు లేవని మినిస్ట్రి ఆఫ్ హెల్త్ అధికారులు క్లారిటీ ఇస్తున్నారు. నిజానికి కరోనా వైరస్ వస్తువులపై ఎక్కువ సమయం ఉండలేవని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన మార్గదర్శకాల్లో కూడా ఉంది. ఇదిలాఉంటే చైనీస్ కమర్షియల్ సెంటర్స్ విజిట్ చేయటం ద్వారా వచ్చే ముప్పు ఏమి లేదని కూడా మినిస్ట్రి ఆఫ్ హెల్త్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు చైనీస్ కమర్షియల్ సెంటర్స్  స్టాఫ్ లో వైరస్ లక్షణాలు కనిపించలేదని వెల్లడించారు. అయితే..చైనా నుంచి వచ్చే ప్రయాణికుల విషయలంలో మాత్రం అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బోర్డర్ పాయింట్స్ లోనే థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి వైరస్ లేదు అని నిర్ధారించుకున్నాకే దేశంలోకి అనుమతిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com