దుబాయ్:గ్లోబల్ వుమెన్స్ ఫోరం ప్రారంభం..షేక్ మొహమ్మద్, ఇవాంక ట్రంప్ హజరు

- February 16, 2020 , by Maagulf
దుబాయ్:గ్లోబల్ వుమెన్స్ ఫోరం ప్రారంభం..షేక్ మొహమ్మద్, ఇవాంక ట్రంప్ హజరు

దుబాయ్:రెండు రోజుల పాటు జరిగే దుబాయ్ వుమెన్స్ ఫోరం GWFD 2020 ఆదివారం గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ఈ ప్రొగ్రాంలో దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ అల్ మఖ్తూమ్,  దుబాయ్ యువరాజు  షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తూమ్ తో పాటు ఇవాంక ట్రంప్ పాల్గొన్నారు. అలాగే యూఏఈ  జెండర్ బ్యాలెన్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్, దుబాయ్ ఉమెన్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రెసిడెంట్ షేఖా మనల్ బింట్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ హజరయ్యారు. మోర్గాన్ స్టాన్లీలో వాల్ స్ట్రీట్ వెటరన్, మేనేజింగ్ డైరెక్టర్ కార్లా హారిస్ నిర్వహించిన సెషన్‌తో GWFD 2020 ఆదివారం ప్రారంభమైంది.

GWFD 2020 మాజీ UK ప్రధాన మంత్రి థెరిసా మే, ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్, IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా కూడా పాల్గొన్నారు. అంతేకాదు దాదాపు 100 మంది గ్లోబల్ లీడర్స్ ఈ ఫోరంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే 87 దేశాల నుంచి వచ్చిన 3000 డెలిగేట్స్ ఈ రెండు రోజుల పాటు జరగబోయే వర్క్ షాప్స్, ప్లీనరీలకు హజరవుతారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన ఇవాంక ట్రంప్ అభివృద్ధి చెందుతున్న దేశాలలోని మహిళలు..తమ దేశం పురోగతిలో భాగస్వామ్యం అవటంపై తన వ్యూస్ షేర్ చేసుకున్నారు. ఇక యూఏఈ జెండర్ బ్యాలెన్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్,  దుబాయ్ ఉమెన్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రెసిడెంట్ షేఖా మనల్ బింట్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మాట్లాడుతూ యూఏఈ అభివృద్ధి బాటలో వెలుగు నింపడానికి GWFD 2020 ఒక అవకాశమని అన్నారు. సొసైటీలో మహిళల ప్రాముఖ్యతను, సామర్థ్యాలను చాటుతాయని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com