నిర్భయ కేసులో దోషి వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం
- February 20, 2020
2012 ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో మరణశిక్ష పడ్డ వారిలో ఒకరైన వినయ్ శర్మ తీహార్ జైలులో ఆత్మహత్యాయత్నం చేశాడు. జైలు గదిలోని గోడకు తలను బలంగా కొట్టుకొని తనను తాను గాయపరుచుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. ఉరి శిక్ష నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేశాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ కోర్టు సోమవారం కొత్త డెత్ వారెంట్ జారీ చేయడంతో నిర్భయ గ్యాంగ్‌రేప్ కేసులో నలుగురు దోషులను ఒకేసారి మార్చి 3న ఉరి తీయనున్నారు. ఈ క్రమంలో ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి అతను తీవ్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అందువల్ల మరణశిక్ష అమలు చెయ్యొద్దని వినయ్ న్యాయవాది గతంలో కోర్టుకు అభ్యర్ధించారు. అయితే అతని వాదనను తోసిపుచ్చిన కోర్టు.. చట్టం ప్రకారం వినయ్‌పై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తీహార్ జైలు సూపరింటెండెంట్‌కు ఆదేశించింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..