జాంబీ డ్రగ్‌ : తన కాలును తానే నరుక్కునేలా చేసింది

- February 22, 2020 , by Maagulf
జాంబీ డ్రగ్‌ : తన కాలును తానే నరుక్కునేలా చేసింది

మాస్కో : జాంబీ డ్రగ్‌ ఓ యువకుడి జీవితాన్ని చిత్తు చేసింది. మితిమీరిన మత్తులో తన కాలును తానే నరుక్కునేలా చేసింది. ఈ సంఘటన రష్యాలోని ప్రొకొపైవిసాక్‌ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రష్యా ప్రొకొపైవిసాక్‌కు చెందిన ఓ 29 యువకుడు పెద్ద మొత్తంలో ' జాంబీ డ్రగ్‌' ( ఒకరకమైన సింథటిక్‌ డ్రగ్‌) తీసుకున్నాడు. దీంతో పూర్తిగా మత్తులో పడిపోయాడు. ఆ మత్తులో తన ఎడమ కాలును శరీరం నుంచి వేరుచేసుకున్నాడు. దీంతో అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. కానీ, అప్పటికే ఆలస్యం అవ్వటంతో వైద్యులు అతని కాలును అతికించలేకపోయారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడ్ని ఇంటెన్సివ్‌ కేర్‌కు తరలించారు. కాగా, సదరు వ్యక్తి ఎవరు, ఈ సంఘటన సరిగ్గా ఎప్పుడు జరిగిందన్న విషయాలు తెలియరాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com