యూపీలో 3 వేల టన్నులకుపైగా బంగారు నిక్షేపాలు
- February 22, 2020
ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో బంగారు నిక్షేపాలున్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో దాదాపు 3 వేల టన్నులకుపైగా బంగారు గనులున్నట్లు జీఎస్ఐ, యూపీ గనులు మరియు భూగర్భ శాఖ సంయుక్త సర్వేలో గుర్తించింది. సోన్భద్రత జిల్లాలోని సోన్‌పహాడీ, హార్దీ ఏరియాల్లో ఈ బంగారు గనులు ఉన్నట్లు పేర్కొంది.
సోన్‌పహాడీలో 2,943 టన్నులు
ఇక సోన్‌పహాడీ ప్రాంతంలో 2వేల 943 టన్నులు, అలాగే హార్దీలో 646 టన్నుల బంగారు నిక్షేపాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ గనులను వెలికి తీయడానికి మైనింగ్ కార్యక్రమాన్ని లీజుకు ఇవ్వాలని యోగి సర్కార్ భావిస్తోంది.
వేలం నిర్వహణకు ఏడుగురు సభ్యుల బృందం
ఈ బంగారు నిక్షేపాలపై సర్వే కొనసాగుతుండగా, ఈ-టెండరింగ్ ద్వారా వేలం వేసేందుకు ఏడుగురు సభ్యుల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బంగారంతోపాటు యురేనియం నిల్వలు కూడా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాగా, సోన్భధ్రలో బంగారు గనులు ప్రస్తుతం దేశంలో ఉన్న 618 టన్నుల కంటే ఐదురెట్లు ఎక్కువ అని, దీని వలిలువ రూ.12 లక్షల కోట్లపైనే ఉంటుందని, దాదాపు 20 ఏళ్ల పాటు ఈ ప్రాంతంలో మైనింగ్‌కు అవకాశం ఉందని జీఎస్ఐ భావిస్తోంది.
ప్రపంచంలోనే భారత్ రెండో స్థానానికి చేరుకుంది
ఒక వేళ జీఎస్ అంచనాలు నిజమైతే బంగారు నిక్షేపాల్లో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానానికి చేరుతుంది. వర్డల్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం చూస్తే.. మొత్తం 8,133.5 టన్నులతో అమెరికా తొలిస్థానంలో ఉండగా, జర్మనీ , ఐఎంఎఫ్, ఇటలీ, ఫ్రాన్స్ లు తర్వాత స్థానాల్లో ఉన్నాయి
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







