దుబాయ్: బోర్డు ఎగ్జామ్స్ ఒత్తిడిని జయించేందుకు స్పెషల్ కేర్
- February 22, 2020
దుబాయ్ లోని ఇండియన్ స్కూల్ స్టూడెంట్స్ అకాడమిక్ ఎగ్జామ్స్ కి రెడీ అవుతున్నారు. అయితే..ఎగ్జామ్స్ కు ఒత్తిడి లేకుండా పీస్ ఫుల్ మైండ్ తో అటెండ్ అయ్యేందుకు వారిని సీబీఎస్ఈ బోర్డు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఇందులో భాగంగా 10, 12 బోర్డ్ ఎగ్జామ్స్ రాయబోయే స్టూడెంట్స్ స్మార్ట్ అండ్ ప్రాక్టికల్ ఐడియాస్ పెంపొందించేలా ఇన్నోవేటీవ్ ప్రాజెక్టును చేపట్టింది.
ఈ ఇన్నోవేటీవ్ ప్రాజెక్టు వేదికైన రషీద్ ఆడిటోరియంను క్యాండిల్ లైట్స్, ఆయిల్ బర్నర్స్ తో హాల్ ను సుంగంధ బరితం చేసింది. దీనిద్వారా స్టూడెంట్స్ లో హ్యాపినెస్, వెల్ బీయింగ్ ఫీల్ తీసుకురావాలన్నది బోర్డు లక్ష్యం. అంతేకాదు..విద్యార్ధుల్లో టోలరెన్స్ ఆఫ్ ఇయర్ స్ఫూర్తిని కలిగించేలా వివిధ కేంద్రాలకు చెందిన పూజారులు పరీక్షలకు బయల్దేరే స్టూడెంట్స్ ను అశీర్వదించాల్సిందిగా బోర్డు కోరింది. స్టూడెంట్స్ ఒత్తిడిని ఎదుర్కునేందుకు స్ట్రెస్ బాల్స్, ఫిడ్జెట్ స్పిన్నర్స్, బబూల్ వ్రాప్స్ ఉన్న డి-స్ట్రెస్ కిట్లను పంపిణి చేశారు.
స్కూల్ సీఈఓ పునిత్ ఎంకే వాసు మాట్లాడుతూ “మా విద్యార్థులు అత్యున్నతంగా రాణించేందుకు మేము చాలా కేర్ తీసుకుంటాము. ఎగ్జామ్స్ రిలేటెడ్ స్ట్రెస్ నుంచి బయటపడేసేలా స్టూడెంట్స్ సిద్ధం చేస్తున్నాం. ఇందుకోసం పలువురు ఎడ్యూకేటర్స్ సాయంతో అవసరమైన స్ట్రాటజిస్ ఫాలో అవుతున్నాం. ఇందులో భాగంగా డి-స్ట్రెస్ ప్రొగ్రామ్ సృజనాత్మకంగా రూపొందించాం. ఈ ఇన్నోవేటీవ్ ప్రొగ్రామ్స్ వారి ఆలోచనాత్మక విధానాలను పెంపొందించేందుకు మరింత దోహదం చేస్తాయి. స్ట్రెస్, ఫియర్ నుంచి ఉపశమనానికి వినికిడి, వాసన, స్పర్శ శాస్త్రీయంగా ముడిపడి ఉన్నాయి. మేం చేపట్టిన ప్రొగ్రామ్స్ తర్వాత స్టూడెంట్స్ ఎంతో ఉత్సాహంగా, రిలాక్స్ గా ఉండటం మాకు ఆనందాన్ని కలిగించింది' అని అన్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







