భారత్‌లో డొనాల్డ్ ట్రంప్ రెండోరోజు షెడ్యూల్ ఇదే
- February 24, 2020
న్యూఢిల్లీ: భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో రోజు షెడ్యూల్ వివరాలు ప్రకటించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో ట్రంప్‌కు స్వాగత కార్యక్రమం ఉంటుంది. 10.30కి రాజ్‌ఘాట్‌లో జాతిపితకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ నివాళులర్పించనున్నారు. 11 గంటలకు హైదరాబాద్ హౌస్‌లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. మధ్యాహ్నం 12.40గంటలకు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఆ తర్వాత మోదీ-ట్రంప్ అధికారిక మీడియా సమావేశం నిర్వహిస్తారు. రాత్రి 7.30కి రాష్ట్రపతి భవన్లో ట్రంప్‌కు విందు ఇవ్వనున్నారు. అనంతరం అమెరికా రాయబార సిబ్బందితో ట్రంప్ భేటీకానున్నారు. రాత్రి 10గంటలకు ట్రంప్ బృందం అమెరికాకు తిరుగుపయనం అవుతుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







