మిస్‌ దివా యూనివర్స్‌ 2020 కిరీటం గెల్చుకున్న అడ్లిన్‌ కాస్టెలినో

- February 25, 2020 , by Maagulf
మిస్‌ దివా యూనివర్స్‌ 2020 కిరీటం గెల్చుకున్న అడ్లిన్‌ కాస్టెలినో

కువైట్‌లో జన్మించిన అడ్లిన్‌ కోస్టెలినో, అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్‌ దివా యూనివర్స్‌ 2020ని గెల్చుకున్నారు. మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2019 వార్తికా సింగ్‌ ఈ కిరీటాన్ని మిస్‌ దివా యూనివర్స్‌ 2020గా గెలిచిన అడ్లిన్‌ కాస్టెలినోకి అందించడం జరిగింది. ప్రముఖ బాలీవుడ్‌ నటులు అనిల్‌ కపూర్‌, ఆదిత్య రాయ్‌ కపూర్‌, మిస్‌ యూనివర్స్‌ 2000 లారా దత్తా, డిజైనర్స్‌ శివన్‌ మరియు నరేష్‌, మిస్‌ సుప్రానేషనల్‌ 2014 ఆషా భట్‌, మిస్‌ యూనివర్స్‌ శ్రీలంక 2006 జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌, డిజైనర్‌ నిఖిల్‌ మెహ్రా మరియు డిజైనర్‌ గవిన్‌ మిగ్యుల్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మలైకా అరోరా గ్రాండ్‌ ఫినాలె ఈవెంట్‌కి హోస్ట్‌గా వ్యవహరించారు. మిస్‌ యూనివర్స్‌ ప్లాట్‌ఫావ్‌ుపై ఇండియా నుంచి అడ్లిన్‌ రిప్రెజెంట్‌ చేస్తున్నారు. అడ్లిన్‌ కాస్టెలినో కేరళకు చెందిన కుటుంబం నుంచి వచ్చారు. ఆమె కువైట్‌లో జన్మించారు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com