దోహా: ఇరాన్ నుంచి దోహ చేరుకున్న ఖతారీ పౌరులు
- February 28, 2020
మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కరోనా వైరస్ అత్యధికంగా వ్యాప్తి చెందుతున్న దేశం ఇరాన్. ఇరాన్ నుంచి గల్ఫ్ కంట్రీస్ కు ట్రావెల్ చేస్తున్న వారిలో ఎక్కువగా కోవిడ్ -19 బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ లో ఉన్న తమ పౌరులను ఖతార్ ప్రభుత్వం వెనక్కి రప్పించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా వారిని దోహాలోని ఓ హోటల్ లో నిర్బంధించింది. తుదుపరి వైద్య పరీక్షలు ముగిసే వరకు వారికి అవసరమైన వసతులను హోటల్ లోనే సమకూర్చింది ప్రభుత్వం. దాదాపు రెండు వారాల పాటు వారు హోటల్ లోనే ఉండేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతానికి ఖాతార్ లో ఒక్క కరోనా వైరస్ కూడా నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. అయితే..ఎవరూ కరోనా వైరస్ వ్యాప్తిపై అనధికారిక సమాచారాన్ని స్ప్రెడ్ చేయవద్దని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







