మక్కా: భక్తులకు అంటు వ్యాధులు సోకకుండా ప్రార్ధన మందిరాల్లో కట్టుదిట్టమైన చర్యలు
- February 28, 2020
ప్రార్ధన చేసేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అంటు వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. మక్కాలోని రెండు మసీదులను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నామని వివరించారు. వివిధ దేశాల నుంచి వచ్చే భక్తులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. మీడియా ద్వారా అన్ని లాంగ్వేజస్ లో ప్రజలకు అవసరమైన సమాచారం అందించటంతో పాటు స్థానికంగా లేటెస్ట్ మెడికల్ ఇన్సస్ట్రక్షన్స్, ఎమర్జెన్సీ డెవలప్మెంట్స్ తెలిపేలా స్క్రీన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ మేరకు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో భక్తులకు అవసరమైన సేవలు అందిస్తామని, భక్తులకు అవసరమైన మాస్క్స్, హ్యండ్ సానిటైజర్ అందిస్తామని వెల్లడించారు. ప్రతీ ఏడాది దాదాపు 7 మిలియన్ మంది భక్తులు కింగ్ డమ్ విజిట్ చేస్తారని వాళ్లంతా జెడ్డా, మదీనా ఎయిర్ పోర్ట్ ద్వారా వస్తారు. అయితే..వైరస్ వ్యాప్తిని నివారించేందుకు అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన సౌదీ ప్రభుత్వం కరోనా ఎఫెక్టెడ్ కంట్రీస్ లోని దాదాపు డజన్ దేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు