చిరంజీవి ఇంటి ముందు ఉద్రిక్త పరిస్థితులు..
- February 29, 2020
హైదరాబాద్:చిరంజీవి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.హైదరాబాద్‌లోని ఆయన ఇంటి ముట్టడికి అమరావతి జేఏసీ పిలుపు ఇచ్చిందని వార్తలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా ఇంటి పరిసరాల్లో బారికేడ్లు పెట్టారు. అటు, జేఏసీ వాళ్లు ముట్టడికి పిలుపు ఇచ్చారని తెలిసి మెగా ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో చిరు ఇంటి వద్దకు చేరుకున్నారు. అన్నయ్యను వివాదాల్లోకి లాగడం ఎందుకంటూ ప్రశ్నించారు. చిరంజీవి జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. ఐతే.. ఈ ముట్టడి వార్తలు కలకలం రేపడంతో అమరావతి JAC కన్వీనర్ వివరణ ఇచ్చారు. తాము ఎవరి ఇంటి ముట్టడికి పిలుపు ఇవ్వలేదని గద్దె తిరుపతిరావు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. అయినా.. ముందు జాగ్రత్తగా చిరు నివాసం వద్ద సెక్యూరిటీ టైట్ చేశారు. 100 మీటర్ల ముందే బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చిరంజీవి ఇంట్లో లేరని షూటింగ్ నిమిత్తం ఫిల్మ్‌సిటీలో ఉన్నారని సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి 3 రాజధానుల నిర్ణయానికి మద్దతు పలికారంటూ కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చిన నేపథ్యంలోనే అమరావతివాసులు ఆయనపై ఆగ్రహంతో ఉన్నారు. ఓ పక్క పవన్ కల్యాణ్, నాగబాబు రైతులకు మద్దతుగా నిలుస్తుంటే.. చిరంజీవి మాత్రం YCP ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చేలా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే చిరు ఇంటి ముట్టడికి JAC పిలుపు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. అదే జరిగితే ఉద్రిక్తత తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో.. JAC వాళ్లను అడ్డుకునేందుకు చిరంజీవి ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు. జైచిరంజీవ అంటూ నినాదాలు చేశారు. ఎవరైనా వచ్చి చిరంజీవి ఇంటి ముందు ఆందోళన చేస్తామంటే ఊరుకునేది లేదని ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. తీరా జేఏసీ ముట్టడికి పిలుపు ఇవ్వలేదని తెలియడంతో శాంతించారు.
హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసం ముందు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ దీక్ష చేయాలని అమరావతి JAC నిర్ణయించిందంటూ 2 రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలంటూ అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ పేరుతో ఓ స్టేట్‌మెంట్ సర్క్యులేట్ అయ్యింది. ఇదంతా వట్టిదేనని JAC క్లారిటీ ఇచ్చినా.. ఏం జరుగుతుందోనన్న అనుమానాల నేపథ్యంలోనే పోలీసులు బారీకేడ్లు పెట్టారు. అభిమానులు కూడా చిరంజీవికి మద్దతుగా ఆయన ఇంటికి వెళ్లారు. ప్రతి దానికీ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తామంటే ఊరుకోబోమని ఫ్యాన్స్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







