కువైట్ పబ్లిక్ సెక్టార్‌లో కొనసాగుతున్న పనులు
- February 29, 2020
కువైట్:పబ్లిక్ సెక్టార్‌లో వర్క్ యధాతథంగా కొనసాగుతోందనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆపే ప్రసక్తి లేదని కువైట్ గవర్నమెంట్ అధికారిక ప్రతినిది¸ తారెక్ అల్ మెజ్రేం చెప్పారు. పౌరుల భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో బాద్యతాయుతంగా వ్యవహరిస్తోందని చెప్పారు. కరోనా వైరస్ నేపథ్యంలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు అల్ మెజ్రేం వివరించారు. స్కూళ్ళకు సెలవులు ఇవ్వడం దగ్గర్నుంచి, పలు చర్యలు తీసుకోవడం ద్వారా కోవిడ్ వ్యాప్తిని అడ్డుకుంటున్నట్లు తెలిపారాయన. కాగా, కరోనా వైరస్‌తో బాధపడుతున్నవారికి మెరుగైన వైద్యం అందుతోందనీ, అందరి పరిస్థితీ నిలకడగా వుందనీ చెప్పారు హెల్త్ మినిస్ట్రీ అధికార ప్రతినిది¸ డాక్టర్ అబ్దుల్లా అల్ సనద్. పబ్లిక్ సెక్టార్‌లో వున్నవారంతా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సూచనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి వుంటుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







