పెన్షన్ పధకం..జగన్ సంచలన నిర్ణయం
- March 01, 2020
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సంక్షేమ పధకాల విషయంలో తీసుకునే నిర్ణయాలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ కోసమే అధికంగా నిధులు కేటాయిస్తోంది. ప్రతినెలా ఈ పెన్షన్ కోసం రూ. 1320 కోట్ల రూపాయలు కేటాయిస్తోంది. జనవరి వరకు 55 లక్షల మంది రాష్ట్రంలో పెన్షన్ అందుకుంటుండగా, ఈ నెల నుంచి మరో 5 లక్షలమందికి లబ్ది చేకూరబోతున్నది.
మొత్తంగా 60 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నారు. మరో ఐదు లక్షల మందికి కొత్తగా పెన్షన్ ఇవ్వబోతుండటంతో అదనంగా ప్రభుత్వంపై రూ. 200 కోట్ల రూపాయల భారం పడింది. అయితే, ఈ ఏడాది ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో 10శాతం నిధులను పెన్షన్ పథకం కోసం కేటాయించబోతున్నట్టు తెలుస్తోంది. ఇది సంచలన నిర్ణయం అని చెప్పాలి.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు