తెలంగాణ బిజెపి NRI సెల్ ఒమాన్ ఆర్ధిక సహాయం
- March 01, 2020
తెలంగాణ:గత నెల భైన్సా లో జరిగిన అల్లర్లలో ఇండ్లు కోల్పోయిన వారికి తెలంగాణ బిజెపి NRI సెల్ ఒమాన్ శాఖ ఆర్థిక సహాయం చేసింది. నిన్న బిజెపి తెలంగాణ NRI సెల్ మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు చేతుల మీదుగా ఇండ్లు కోల్పోయిన ఇరువై కుటుంబాలకు పదివేల చొప్పున మొత్తం 20,2000 రూపాయలు ఆర్థిక సహాయం చేసారు.ఈ సందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ ఒమాన్ కన్వీనర్ కుమార్ మంచికట్ల ఆధ్వర్యంలో బాపురెడ్డి రాజిరెడ్డి, ప్రభాకర్ సిరిమల్లె,హన్మాండ్లు ముక్కెర, నరేష్ ఆంబోజి, అల్లే గంగాధర్ మరియు ముఖ్య కార్యకర్తలు స్పందించి ఈ విరాళం ను అందించారని ఎన్నారై లు బాధితుల కు అండగా ఉంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ బిజెపి అధ్యక్షురాలు డా.పడకంటి రమాదేవి, ఒమాన్ బిజెపి నాయకులు శ్రీపాద ఆనంద్,సేపూరీ గోపాల్, మధు కోమటిరెడ్డి, జీవన్ కుమార్ పన్నీరు పాల్గొన్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమాన్)



తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







