ఒమన్:ఫోన్ కోసం సూసైడ్ చేసుకున్న 14 ఏళ్ల బాలుడు
- March 04, 2020
ఒమన్ లో 14 ఏళ్ల బాలుడు మోటర్ బైక్ టైర్ ట్యూబ్ తో ఉరి వేసుకొని చనిపోయాడు. మంగళవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో తన రూంలోనే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఫోన్ విషయంలో తన తండ్రి మందలించటం వల్లే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. రాయల్ ఒమన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితుడు అల్ ధహిరా గవర్నరేట్‌లోని విలాయత్ ఇబ్రి నివాసి. లంచ్ టైంలో ఫోన్ విషయంలో తన తండ్రితో అతనికి వాదన జరిగింది. దీంతో మనస్థాపానికి గురైతన అతను రూంలోకి వెళ్లి విపరీత చర్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ టీం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







