యూఏఈలో మరో ఆరుగురికి సోకిన కరోనా వైరస్
- March 04, 2020
యూఏఈలో కొత్తగా మరో ఆరుగురికి కరోనా వైరస్ సోకింది. కోవిడ్-19 బారిన పడిన వాళ్లందరికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ మేరకు చికిత్స అందిస్తున్నట్లు మినిస్ట్రి ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ అధికారులు ప్రకటించారు. కొత్తగా వైరస్ సోకిన ఆరుగురిలో ఇద్దరు రష్యన్లు, ఇద్దరు ఇటాలియన్స్ ఉన్నారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు జర్మన్, మరొకరు కొలంబియన్. సైక్లింగ్ ఈవెంట్ కు వచ్చిన ఇద్దరు కరోనా పేషెంట్లతో వీళ్లంతా క్లోజ్ గా మూవ్ అయ్యారని, ఆ ఇద్దరి నుంచి ఈ ఆరుగురికి వైరస్ విస్తరించిందని తెలిపారు. ప్రస్తుతం వారి హెల్త్ కండీషన్ స్టేబుల్ గానే ఉంది. సైక్లింగ్ టూర్ కు వచ్చిన అథ్లెట్లకు వైరస్ వ్యాపించే అవకాశాలు ఉండటంతో వారు బస చేసిన రెండు హోటళ్లను నిర్బంధించారు. అందులోని అథ్లెట్స్, అడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్ ఇతరులతో కాంటాక్ట్ కాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. అలాగే అథ్లెట్స్ కు కోవిడ్-19 టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఎవరికి పాజిటీవ్ అని నిర్ధారణ కాలేదు. అయినా..ముందు జాగ్రత్తగా రీ చెకప్ కూడా చేస్తున్నారు. అలాగే హటల్ బిల్డింగ్స్, వెహికిల్స్, పరిసర ప్రాంతాల్లో స్టెరిలైసేషన్ ప్రొసీజర్ చేపట్టారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!