దోహా:స్వీట్స్ లో 11.627 కేజీల డ్రగ్స్..కస్టమ్స్ తనిఖీల్లో పట్టుబడిన ఎషియన్

- March 05, 2020 , by Maagulf
దోహా:స్వీట్స్ లో 11.627 కేజీల డ్రగ్స్..కస్టమ్స్ తనిఖీల్లో పట్టుబడిన ఎషియన్

దోహా:స్వీట్స్ లో నిషేధిత డ్రగ్స్ దాచి కస్టమ్స్ ను బురిడికొట్టించబోయాడో స్మగ్లర్. ఏకంగా 11.627 కిలోల నిషేధిత హషిష్ ను స్వీట్స్ లోపల కుక్కి ఖతార్ లోకి ఎంటర్ అవబోయాడు. అయితే..హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అఫీసర్స్ కు దొరికిపోయాడు. తనిఖీలో పట్టుబడిన హషిష్ ను కస్టమ్స్ అఫీసర్స్ సీజ్ చేశారు. స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన అసియా కంట్రీస్ కు చెందిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. డ్రగ్స్ విషయంలో గల్ఫ్ కంట్రీస్ లో కఠిన చట్టాలు అమలులో ఉన్నాయి. తెలిసి చేసినా, ఇతరుల ప్రమేయంతో తెలియక చేసినా కఠిన శిక్షలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని తాము పదే పదే చెబుతూ వస్తున్నామని, దేశంలో ఏ రకమైన ఇల్లిగల్ వస్తువులు, పదార్థాలు తీసుకురావొద్దని రిపీటెడ్ గా హెచ్చరిస్తున్నామని కస్టమ్స్ అఫీసర్స్ చెబుతున్నారు. తమ దగ్గర ఉన్న హై టెక్ డివైజెస్ తో స్మగ్లింగ్ గూడ్స్ ను ఇట్టే పసిగట్టేయగలమని, అదే సమయంలో ప్యాసింజర్ల బాడీ లాంగ్వేజ్ బట్టి నిషేధిత వస్తువులను స్మగ్లింగ్ చేస్తున్నవారిని గుర్తించగలమని కూడా హెచ్చరించారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com