కరోనా అలర్ట్:దుబాయ్ లో ఇండియన్ స్కూల్ స్టూడెంట్ కి కరోనా
- March 05, 2020
దుబాయ్ లో ఇండియన్ స్కూల్ లో 16 ఏళ్ల బాలుడికి కరోనా టెస్టులో పాజిటీవ్ వచ్చింది. ఓవర్సీస్ నుంచి తిరిగి వచ్చిన తన తండ్రి నుంచి బాలుడికి కోవిడ్-19 సోకింది. విదేశాల నుంచి తిరిగొచ్చిన ఐదు రోజుల తర్వాత అతనిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. అతనికి బ్లడ్ శాంపుల్ టెస్ట్ చేయటంతో వైరస్ ఉన్నట్లు తేలింది. అతని కుటుంబ సభ్యులకు కూడా టెస్ట్ చేయటంతో 16 ఏళ్ల బాలుడికి కూడా పాజిటీవ్ వచ్చింది. దీంతో ఎన్ఆర్ఐ ఫ్యామిలీని అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. లేటెస్ట్ కేసుతో అలర్టైన దుబాయ్ హెల్త్ అథారిటీ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ప్రివెంటీవ్ మెజర్స్ పై ఫోకస్ చేస్తున్నారు. కరోనా ఇన్ ఫెక్టెడ్ స్టూడెంట్ చదువుతున్న ఇండియన్ స్కూల్ కు సెలవులు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లు స్కూల్ లో శానిటైజేషన్ చేపట్టారు. అలాగే స్కూల్ లో చదువుతున్న స్టూడెంట్స్, స్టూడెంట్స్ ఫ్యామిలీస్, స్కూల్ స్టాఫ్ హెల్త్ కండీషన్ ను మానిటర్ చేస్తున్నారు. వాళ్లందరికీ కోవిడ్-19 టెస్టులు చేస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







