ఉమ్రా బ్యాన్‌ తర్వాత తొలి ఫ్రైడే ప్రేయర్స్‌

- March 07, 2020 , by Maagulf
ఉమ్రా బ్యాన్‌ తర్వాత తొలి ఫ్రైడే ప్రేయర్స్‌

మక్కా:మక్కా మరియు మదీనాలోనిలోని గ్రాండ్‌ మాస్క్‌ వద్ద ముస్లింలు శుక్రవారం ప్రార్థనల్ని నిర్వహించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో మక్కా మరియు మదీనాలో మాస్క్‌ వద్ద కనీ వినీ ఎరుగని స్థాయిలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టిన విషయం విదితమే. ఉమ్రా బ్యాన్‌ తర్వాత జరిగిన తొలి శుక్రవారం ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా షేక్‌ అబ్దుల్లా అవాద్‌ అల్‌ జుహాని మాట్లాడుతూ, వైరస్‌ వ్యాప్తిని నిరోధించే విధంగా షరియత్‌ చట్టానికి లోబడి అధికార వర్గాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయని అన్నారు. వైరస్‌ వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా తాత్కాలికంగా కాబా ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేశారు. హిల్స్‌ ఆఫ్‌ సాఫా మరియు మర్వాలో కూడా నిషేధాజ్జలు అమలు చేశారు. మదీనాలోని ప్రొఫెట్‌ మాస్క్‌లోగల సేక్రెడ్‌ ఛాంబర్‌ని కూడా మూసివేయడం జరిగింది. కాగా, టూరిజం సెక్టార్‌ సహా అనేక విభాగాలు వైరస్‌ ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారిపై తాత్కాలిక నిషేధం విధించడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com