డిపార్టింగ్‌ ప్రయాణీకులకు స్మార్ట్‌ గేట్స్‌ నిలిపివేత

- March 09, 2020 , by Maagulf
డిపార్టింగ్‌ ప్రయాణీకులకు స్మార్ట్‌ గేట్స్‌ నిలిపివేత

దుబాయ్‌: దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ అలాగే దుబాయ్‌ వరల్డ్‌ సెంట్రల్‌, డిపార్టింగ్‌ పాసెంజర్స్‌కి మార్చి 8 నుంచి స్మార్ట్‌ గేట్స్‌ అందుబాటులో లేకుండా చేశారు అధికారులు. కరోనా వైరస్‌ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్‌ హెల్త్‌ అథారిటీ, థాయిలాండ్‌, లెబనాన్‌, సిరియా, ఇటలీ, చైనా నుంచి వచ్చే ప్రయాణీకులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ని నిర్వహించడం జరుగుతోంది. జిసిసిఎ గైడ్‌లైన్స్‌ ప్రకారం, బహ్రెయిన్‌, ఇరాన్‌ మరియు చైనా నుంచి వచ్చే విమానాల్ని సస్పెండ్‌ చేశారు. యూఏఈ - సౌదీ అరేబియా మధ్య విమానాల్ని రియాద్‌, జెడ్డా, దమ్మావ్‌ు ఎయిర్‌ పోర్టులకే పరిమితం చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com