కరోనా: ఇరాన్‌లో ఒక్కరోజే 49 మంది మృతి...మరో 743 కేసులు
- March 09, 2020
ఇరాన్: కరోనా వైరస్ (కొవిడ్ -19) చైనాలో కాస్త తుగ్గముఖం పట్టినప్పటికి ఇతర దేశాల్లో మాత్రం ఈవైరస్‌తో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇరాన్‌లో కరోనాతో ఒక్క రోజే 49 మంది మృతి చెందారు. కోవిడ్19 కారణంగా దేశంలో గత 24 గంటల్లో 49 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి యానుష్ జహాన్‌పూర్ ఆదివారం (మార్చి 8) తెలిపారు. దేశంలో కరోనాతో ఇప్పటివరకు 194 మంది ప్రాణాలు కోల్పోయారు. 6566 మంది కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇరాన్‌లో అక్కడా, ఇక్కడా అని కాకుండా మొత్తం 31 ప్రావిన్సులకు కరోనా పాకింది. తన ప్రభావం చూపుతోంది. కరోనా వైరస్ ప్రభావం చైనా తర్వాత ఇరాన్ దేశం పైనే అత్యంత తీవ్రంగా ఉంది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







