కరోనా ఎఫెక్ట్: 14 దేశాలపై తాత్కాలిక నిషేధాన్ని విధించిన ఖతార్
- March 09, 2020
దోహా (ఖతార్): కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో 14 దేశాలకు చెందిన విమాన సర్వీసుల రాకపోకలపై నిషేధం విధిస్తూ ఖతార్ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాపించకుండా నివారించేందుకు ముందుజాగ్రత్త చర్యగా భారత్ తోపాటు 14 దేశాలకు చెందిన విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిషేధించామని ఖతార్ దేశం ప్రకటించింది. చైనా, ఈజిప్టు, భారత్, ఇరాన్, ఇరాక్, లెబనాన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్, ఫిలిఫ్పీన్స్, దక్షిణ కొరియా, శ్రీలంక, సిరియా, థాయ్ లాండ్ దేశాల నుంచి అన్ని విమానాల రాకపోకలను నిషేధించామని ఖతార్ వివరించింది. కరోనా వైరస్ ప్రబలిన ఇటలీ దేశం నుంచి ఖతార్ దేశానికి విమానాల రాకపోకలను ఖతార్ ఎయిర్ వేస్ గతంలోనే నిషేధించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







