వైమానికదళ విమానంలో ఇరాన్ నుంచి 58 మంది ఇండియాకు

- March 10, 2020 , by Maagulf
వైమానికదళ విమానంలో ఇరాన్ నుంచి 58 మంది ఇండియాకు

కరోనా వైరస్ పేరు చెబితేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. చైనా తర్వాత ఇరాన్‌లోనే వైరస్ బారినపడి చనిపోయారు. అయితే అక్కడికి వెళ్లిన భారతీయ పర్యాటకులను స్వదేశం తీసుకొచ్చారు. అక్కడి భారత రాయబార అధికారులతో సంప్రదింపులు జరిపి, భారత వైమానిక దళ విమానంలో ఇండియా తీసుకొచ్చారు.

పర్యటన కోసం ఇరాన్ వెళ్లిన వారిని తీసుకొచ్చేందుకు ఆదివారమే వైమానికి దళానికి చెందిన సీ-17 విమానం వెళ్లింది. కానీ అక్కడి ప్రక్రియ పూర్తి చేయడానికి సమయం పట్టింది. ఇరాన్‌లో భారతీయ రాయబార కార్యాలయ అధికారులు.. అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 2 గంటలకు టెహ్రాన్ విమానాశ్రయం నుంచి ప్రయాణికులతో పాటు ప్లైట్ బయల్దేరింది. మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఘజియాబాద్‌లోని హిందాన్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండయ్యింది.

ప్లైట్ దిగిన వెంటనే వారిని 14 రోజులపాటు ఐసోలేషన్ వార్డులో ఉంచుతారు. అన్నీ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే.. తమ స్వస్ధలాలకు పంపిస్తారు. ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ పర్యాటకులను స్వదేశం తీసుకొచ్చేందుకు సాయం చేసిన భారత రాయబార కార్యాలయ అధికారులకు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ధన్యవాదాలు తెలిపారు. మెడికల్ టీం, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బృందానికి కూడా థాంక్స్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com