నిర్మాతగా మారనున్న జగపతిబాబు..
- January 23, 2016
ప్రతి నాయకుడిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టాక జగపతిబాబు కెరీర్ ఓ రేంజులో ఉంది. మహేష్‌బాబు, ఎన్టీఆర్, బాలకృష్ణ... ఇలా అగ్ర కథానాయకులతో దీటుగా నటించే అవకాశం దక్కింది. దాంతో పాటు పారితోషికాన్నీ భారీగానే అందుకొంటున్నట్టు సమాచారం. ఇక హీరోయిజం వైపుకి మనసు మళ్లే అవకాశాల్లేవు. అయితే... నిర్మాతగా మాత్రం ఓ ప్రయత్నం చేద్దామని భావిస్తున్నట్టు తెలుస్తోంది. జగపతి బ్యానర్‌పై ఇది వరకు ఎన్నో మంచి చిత్రాలొచ్చాయి. నిర్మాతగా విబి రాజేంద్రప్రసాద్ ఆణిముత్యాల్లాంటి చిత్రాలందించారు. గత కొన్నేళ్లుగా జగపతి బ్యానర్ నుంచి సినిమాలేం రాలేదు. ఓ పెద్ద విజయంతో ఆ సంస్థ కార్యకలాపాల్ని మళ్లీ ఘనంగా పునః ప్రారంభించాలని జగపతిబాబు ఆలోచిస్తున్నారట. అయితే ఆ సినిమాలో జగపతిబాబే నటిస్తారా, మరో కథానాయకుడి కోసం నిర్మిస్తారా అన్నది వేచి చూడాలి.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









