అబుధాబి: స్పోర్ట్స్, రెస్టారెంట్స్, షాపింగ్స్ తో ఫస్ట్ వుమెన్ బీచ్ రెడీ

- March 11, 2020 , by Maagulf
అబుధాబి: స్పోర్ట్స్, రెస్టారెంట్స్, షాపింగ్స్ తో ఫస్ట్ వుమెన్ బీచ్ రెడీ

అబుధాబి:మహిళల సాధికారత దిశగా అడుగులు వేస్తున్న దుబాయ్ లో వుమెన్స్ కోసం మరో ప్రాజెక్ట్ రెడీ అయ్యింది. కేవలం మహిళల కోసమే అబుధాబిలో ఓ ప్రైవేట్ బీచ్ రెడీ అయ్యింది. ప్రైవేట్ బీచ్ కోసం చేపట్టిన పనులు పూర్తి అయ్యాయి. ధఫ్రా రీజియన్ మునిసిపాలిటీ సహకారంతో అబుధాబి జనరల్ సర్వీసెస్ కంపెనీ ముసనాడ కంపెనీ ప్రాజెక్టును పనులు చేపట్టింది. అబుదాబికి 350 కిలోమీటర్ల దూరంలో, దుబాయ్ కి 450 కిలోమీటర్ల దూరం అల్ ధఫ్రాలోని అల్ సిలా నగర పరిధిలో బీచ్ నిర్మించారు. దాదాపు 18,300 మీటర్ల మేర ఈ ప్రైవేట్ బీచ్ విస్తరించి ఉండగా..790 మీటర్ల విస్తీర్ణయంలో 8 యుటిలిటీ బిల్డింగ్స్, రెస్టారెంట్స్, షాప్స్ కు సంబంధించిన బిల్డింగ్స్ నిర్మించారు. అబుధాబి గవర్నమెంట్ రిలీజ్ చేసిన వీడియో ప్రకారం ప్రైవేట్ బీచ్ లో స్విమ్మింగ్ పూల్స్, స్పోర్ట్స్ కోర్ట్స్ , కవర్డ్ వాక్ వేస్ పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కేవలం మహిళల కోసమే నిర్మించిన ఈ ప్రైవేట్ బీచ్ లో సందర్శకులకు మంచి లీజర్ స్పాట్ గా మలచలాన్నదే తమ లక్ష్యమని ట్విట్టర్ లో అధికారులు తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com