దోహా: ఆన్ లైన్ లో బిర్లా పబ్లిక్ స్కూల్ క్లాసెస్..కరోనాతో కొత్త డిసిషన్
- March 11, 2020
కరోనా ఎఫెక్ట్ తో స్కూల్స్ మూసివేయాలన్న ఖతార్ ప్రభుత్వ ఆదేశాల మేరకు దోహాలోని పబ్లిక్ స్కూల్ కూడా తమ స్టూడెంట్స్ కి సెలవులు ప్రకటించింది. అయితే..తమ స్టూడెంట్స్ కి ఆన్ లైన్ ఫ్లాట్ ఫాం (వర్చువల్ క్లాసెస్) ద్వారా క్లాసెస్ స్టార్ట్ చేయాలని బిర్లా స్కూల్ యాజమాన్యం నిర్ణయించింది. గ్రేడ్ 12 స్టూడెంట్స్ కి (అకాడమిక్ ఇయర్ 2020-21) కి మార్చి 15 నుంచి వర్చువల్ క్లాసెస్ స్టార్ట్ చేయనున్నారు. అలాగే టెన్త్ గ్రేడ్ స్టూడెంట్స్ కి మార్చి 22 నుంచి, సిక్స్త్ నుంచి నైన్త్ వరకు స్టూడెంట్స్ కి వచ్చే నెల 5 నుంచి వర్చువల్ క్లాసెస్ ప్రారంభం అవుతాయి. ఇక ఫిఫ్త్ గ్రేడ్ స్టూడెంట్స్ వరకు మాత్రం వర్చువల్ క్లాసెస్ చేపట్టడం లేదు. మినిస్ట్రి ఆఫ్ ఎడ్యూకేషన్ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చాక వారికి క్లాసెస్ ప్రారంభించనున్నారు. అయితే..గ్రేడ్ టెన్త్, టువెల్త్ స్టూడెంట్స్ కి CBSE బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని స్కూల్ నిర్వాహకులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా స్కూల్ నుంచి ఎలాంటి ట్రాన్స్ పోర్టేషన్ ఉండదని, పేరెంట్స్ తమ పిల్లల్ని ఎగ్జామ్ సెంటర్ దగ్గర డ్రాప్ అండ్ పికప్ చేసుకోవాలని సూచించారు. ఇక కేజీ నుంచి ఎయిత్ వరకు స్టూడెంట్స్ కి మాత్రం ఎగ్జామ్స్ రద్దు చేశారు. ఇప్పటి వరకు నిర్వహించిన ఎగ్జామ్స్ లో వచ్చిన మార్కులను బట్టి వచ్చే యావరేజ్ మార్కులనే అకాడమిక్ మార్కులుగా కన్పిడర్ చేయనున్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







