గల్ఫ్ ఎయిర్ ‘నో ఫీజ్.. అన్ లిమిటెడ్ ఛేంజెస్’ క్యాంపెయిన్
- March 11, 2020
కింగ్డమ్ నేషనల్ కెరియర్ గల్ఫ్ ఎయిర్, విమాన ప్రయాణీకులకు మరింత సులభతరమైన ప్రయాణం కోసం సరికొత్త క్యాంపెయిన్‌ని ప్రారంభించింది. నోవెల్ కరోనా వైరస్ కోవిడ్ 19 నేపథ్యంలో ఈ క్యాంపెయిన్‌ని ప్రారంభించినట్లు గల్ఫ్ ఎయిర్ వర్గాలు వెల్లడించాయి. మార్చి 31 వరకు బుకింగ్స్ చేసుకున్న ప్రయాణీకులు తమ ట్రావెల్ డేట్స్‌కి సంబంధించి అన్‌లిమిటెడ్ ఛేంజెస్ చేసుకోవడానికి వీలు కల్పించారు. ఈ విధానంలో ఎలాంటి అదనపు ఛార్జీలూ వుండవు.తమ ఫాల్కన్‌ఫ్లైయర్ మెంబర్స్‌కి, తమ స్టేటస్ అలాగే మెంబర్ షిప్ టైర్‌ని మరో మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది గో ఎయిర్. అవసరమైన నంబర్ ఆఫ్ ట్రిప్స్ లేదా మైల్స్‌తో సంబంధం లేకుండానే ఈ ఎక్స్‌టెన్షన్ వుంటుంది. ఎయిర్ క్రాఫ్ట్స్‌లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అన్ని రకాలైన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా గల్ఫ్ ఎయిర్ పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







